సత్తాచాటిన ఆవుడం యువకుడు
నెన్నెల: మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన మండల సుమంత్‌గౌడ్ సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో 286వ ర్యాంకు, మల్టీజోన్‌లో 126వ ర్యాంకు సాధించారు. గతంలో గ్రూప్–2, 3, 4లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్–2లో రాష్ట్ర స్థాయిలో 172వ ర్యాంకు, గ్రూప్–3లో 102వ ర్యాంకు, గ్రూప్–4లో 88వ ర్యాంకు దక్కించుకున్నారు. గ్రూప్–1 సాధించడమే లక్ష్యంగా కోచింగ్ లేకుండా రోజుకు 10 గంటలు కష్టపడి చదివానని తన కష్టానికి తగిన ర్యాంకు వచ్చిందని సుమంత్ సంతోషం వ్యక్తం చేశాడు.


