‘నాగోబా’కు సీఎంను ఆహ్వానించిన ‘మెస్రం’
ఇంద్రవెల్లి: నాగోబా జాతర, దర్బార్‌కు విచ్చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి మెస్రం వంశీయులు ఆహ్వానపత్రం అందించారు. సీఎం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా వారు ముఖ్యమంత్రిని శుక్రవారం కలిశారు. మహాపూజ, దర్బార్‌కు రావాలని కోరారు. సానుకులంగా స్పందించిన సీఎం తాను వచ్చే జాతరకు వస్తానని, ఈ సారి రాష్ట్ర మంత్రులు హాజరవుతారని పేర్కొన్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు. ఇందులో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఆలయ పీఠాధిపతి వెంకట్‌రావ్, సర్పంచ్ తుకారాం, ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావ్, తదితరులున్నారు.


