మూడో ప్రయత్నంలో విజయం..
హాజీపూర్ మండలం దొనబండ గ్రామానికి చెందిన గొర్రె అఖిల్ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అఖిల్ తల్లిదండ్రులు ఉమారాణి–దేవయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ కుమారుడికి దేశసేవ చేసే ఉద్యోగం రావడం ఆనందంగా ఉందని తెలిపారు. బంధుమిత్రులూ అఖిల్‌ను అభినందించారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. తాను బీటెక్ మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి మొదటి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యానని తెలిపాడు. అయినా.. నిరుత్సాహ పడకుండా మూడో ప్రయత్నంలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. దేశసేవలో భాగస్వామిని అవుతుండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు.


