శిలాఫలకం ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు
రామకృష్ణాపూర్: శిలాఫలకం ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై భూమేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 11వ వార్డులో డ్రైనేజీ పనుల కోసం సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. శుక్రవారం ఉదయం శిలాఫలకం ధ్వంసమై ఉండటంతో మున్సిపల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. తాగిన మైకంలో 11వ వార్డుకే చెందిన గోసుక సురేశ్ తన ఇంటి వద్ద ఓ ఫ్లెక్సీని నెట్టివేసే ప్రయత్నం చేయబోయి పక్కనే ఉన్న శిలాఫలకంపై పడడంతో అది ధ్వంసమైనట్లు సీసీ ఫుటేజీలో స్పష్టమైందని ఎస్సై తెలిపారు. ఈ మేరకు సురేశ్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


