సాయుధ దళంలోకి మనోళ్లు
యువకుడికి సన్మానం
వాంకిడి: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగం సాధించిన హివ్రె సంజీవ్‌ను సర్పంచ్ చునార్‌కార్ సతీశ్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలగతి సుచిత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. వాంకిడికి చెందిన యువకుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం సాధించడం అభినందనీయమని కొనియాడారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు మండోకార్ వికాస్, యువకులు శ్రీనివాస్, బాలరాజు, సుదర్శన్, సాయ్, ఏక్‌నాథ్, ఽశివ, సందీప్, తదితరులు పాల్గొన్నారు.


