పట్టుదలే రాజ్‌కుమార్ బలం
హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రా మానికి చెందిన మొగిళి రాజ్‌కుమార్ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. రాజ్‌కుమార్‌ను అతడి తల్లిదండ్రులు లక్ష్మి–శ్రీనివాస్ కూలీ పనులు చేసుకుంటూ చదివించారు. 2017లో తండ్రి శ్రీనివాస్ మృతి చెందగా అతడి పెద్దన్న సంతోష్ ఇంటి బాధ్యతలు మోశాడు. తాను కూడా కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు సోదరులను చదివించా డు. ఒక తమ్ముడు ఇప్పటికే ఆర్మీ ఉద్యోగం చేస్తుండగా మరో తమ్ముడు రాజ్‌కుమార్ తాజా ఫలితాల్లో బీఎస్‌ఎఫ్ ఉద్యోగం సాధించాడు. డిగ్రీ పూర్తి చేసిన రాజ్‌కుమార్ ఏడు ప్రయత్నాల్లో విఫలమై ఎనిమిదో ప్రయత్నంలో ఎట్టకేలకు విజయం సాధించాడు. తన సోదరుల కష్టం, తల్లిదండ్రుల ఆ శీర్వాదంతో పాటు ఆర్మీ సోదరుడి స్ఫూర్తితో ఉద్యోగం సాధించడం అదృష్టంగా భావిస్తున్నట్లు రాజ్‌కుమార్ తెలిపాడు.


