మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య
లక్సెట్టిపేట: మండలంలో ని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పు తిరుప తి (44) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి భార్యకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగాలేదు. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన తిరుపతి మద్యానికి బానిసయ్యాడు. సంక్రాంతి రోజు గ్రామంలో అందరూ పండుగ జరుపుకొంటుండగా తనకు మాత్రం సంతోషంగా లేదని మనస్తాపానికి గురయ్యడు. అదేరోజు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తిరుపతికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కుమారుడు విష్ణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


