జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సీవోఈ విద్యార్థి
బెల్లంపల్లి: బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ(సీవోఈ ) పాఠశాల/కళాశాల విద్యార్థి జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. 9వ తరగతి విద్యార్థి ఎల్కటూరి రోహిత్ గత నెల 5, 6, 7వ తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–14 విభాగంలో క్రికెట్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు తరఫున పాల్గొన్నాడు. ప్రతిభ కనబర్చడంతో జాతీయ స్థాయిలో ఈ నెల 19న రాజస్థాన్ రాష్ట్రం సికార్ జిల్లా చూరు పట్టణంలో జరిగే క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్‌సాగర్ ప్రకటించారు. రోహిత్‌ను ప్రిన్సిపాల్ విజయ్‌సాగర్, వైస్ ప్రిన్సిపాల్ తన్నీరు గోపి, ఉపాధ్యాయులు దశరథం, కొండలరావు, పీఈటీలు అల్లూరి వామన్, ముచ్చకుర్తి రాజశేఖర్ అభినందించారు.


