రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్పీస్ 2017 బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రా ట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, డిఫరెన్స్ బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. డీడీలు చెల్లించిన వారికి హయ్యర్ పింఛన్ మంజూరు చేయాలన్నారు. అక్టోబర్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన వారికి గ్రాట్యుటీ చెల్లించాలని తెలిపారు. అనంతరం డీఎం శ్రీనివాస్‌లుకు వినతిపత్రం అందజేశా రు. ఈ కార్యక్రమంలో మధుసూధన్, వీఎస్ రావు, ఎండీ పాషా, నారాయణ, జీఎన్‌రావు, రామ య్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


