● ఒకే కేంద్రంలో 61 మంది ఎంపికపై విచారణకు తల్లిదండ్రుల వినతి
ఖానాపూర్: భైంసా పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ ఉర్దూ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష కేంద్రంలో 61 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడంపై విచారణ జరిపించాలని విద్యార్థుల తల్లి దండ్రులు, నాయకులు కోరారు. హైదరాబాద్‌లో తెలంగాణ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సోమవారం ఫిర్యాదు చేశారు. గతేడాది నవంబర్ 24న జరిగిన ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష జరిగిందని తెలిపారు. ఇటీవల ప్రకటించిన ప్రోవిజినల్ లిస్టులో అధికారులు 68 మంది పేర్లు ప్రకటించగా, అందులో భైంసా కేంద్రానికి చెందిన వారే 61 మంది ఎంపిక కావడంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. విచారణ చేసి మిగతా విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఫిర్యాదు చేసినవారిలో పుప్పాల గజేందర్, విద్యార్థుల తల్లి దండ్రులు ఉన్నారు.