
చిరుతపులి చర్మం, స్మగ్లర్ల పట్టివేత
చెన్నూర్: తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని కోటపల్లి మండలం రాపన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద సోమవారం ఇద్దరు అంతర్రాష్ట్ర చిరుతపులి చర్మం స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. చిరుత చర్మం, మోటారుసైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. చెన్నూర్ ఫారెస్టు డివిజన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రావు వివరాలు వెల్లడించారు. కోటపల్లి ఎస్సై రాజేందర్ రాపన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. మహారాష్ట్ర నుంచి ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిళ్లపై మంచిర్యాల వైపు వస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. మోటార్‌సైకిళ్లను తనిఖీ చేయగా చిరుతపులి చర్మం, గోర్లు లభించాయి. వారిని విచారించగా.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా వర్థల్లి గ్రామానికి చెందిన దుర్గం పవన్ గత రెండేళ్ల క్రితం బీజాపూర్ జిల్లా బొడగుట్ట అటవీ ప్రాంతంలో హతమార్చాడని వెల్లడైంది. చిరుతపులి చర్మాన్ని విక్రయించడానికి బీజాపూర్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన బాబర్‌ఖాన్‌ను పవన్ సంప్రదించాడు. చర్మం విక్రయించి ఇస్తే రూ.50వేలు ఇస్తానని అతడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సోమవారం చిరుతపులి చర్మాన్ని విక్రయించేందుకు మోటార్‌సైకిళ్లపై మంచిర్యాల వైపు వస్తుండగా పవన్, బాబర్‌ఖాన్‌లను పోలీసులు పట్టుకున్నారు. చిరుత చర్మం, రెండు మోటారుసైకిళ్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చిరుతచర్మంగా కోటపల్లి ఎఫ్‌ఆర్వో రవి ధ్రువీకరించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చిరుతచర్మం, మోటర్ సైకిళ్లను అటవీ అధికారులకు అప్పగించామని ఏసీపీ వివరించారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎఫ్‌డీవో రమేశ్, కోటపల్లి ఎస్సై రాజేందర్, ఎఫ్‌ఆర్వో రవి పాల్గొన్నారు.
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రావు

చిరుతపులి చర్మం, స్మగ్లర్ల పట్టివేత