పాఠశాలలో డీఈవో తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలో డీఈవో తనిఖీ

Apr 20 2024 1:25 AM | Updated on Apr 20 2024 1:25 AM

పరీక్షలను పరిశీలిస్తున్న డీఈవో యాదయ్య - Sakshi

పరీక్షలను పరిశీలిస్తున్న డీఈవో యాదయ్య

భీమారం: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో యాదయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు ఏరోజు నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం అదేరోజు చేయాలని ఆదేశించారు. ఈ నెల 23న విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రతిభను తెలియజేయాలని పేర్కొన్నారు. పరీక్ష పేపర్లను ఎట్టిపరిస్థితుల్లో లీక్‌ చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు విక్రం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement