పర్యావరణానికి పాటుపడాలి | Sakshi
Sakshi News home page

పర్యావరణానికి పాటుపడాలి

Published Sat, Apr 20 2024 1:25 AM

సైకిల్‌ ర్యాలీలో గని అధికారులు, కార్మికులు  - Sakshi

బెల్లంపల్లి: పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మందమర్రి ఏరియా శాంతిఖని గ్రూప్‌ఆఫ్‌ మైన్స్‌ ఏజెంట్‌ ఆర్‌.విజయప్రసాద్‌ అన్నారు. శుక్రవారం ప్రపంచ ప ర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప ర్యావరణ పరిరక్షణలో భాగంగా గని ఆవరణ లో షాప్ట్‌ నుంచి ఫ్యాన్‌ హౌజ్‌ వరకు సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కా ర్మికులు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకుంటేనే భావితరాలకు భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా శక్తిని, నీటిని ఆదా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్‌ ఇంజినీర్‌ బసవరాజు, గ ని మేనేజర్‌ సంజయ్‌కుమార్‌సిన్హా, ఫిట్‌ ఇంజి నీర్‌ రాంబాబు, బీఎం ఇంచార్జీ ముస్తాఫా, వెంటిలేషన్‌ అధికారి పూర్ణచందర్‌, గని సంక్షేమ అధికారి సత్యనారాయణ, ఏఐటీయూసీ ఫిట్‌ సెక్రెటరీ దాసరి తిరుపతిగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement