
కాజిపల్లి పనిస్థలంలో మాట్లాడుతున్న డీఆర్‌డీవో కిషన్
భీమారం: పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్క రూ ఓటు హక్కు వినియోగించుకోవాలని డీ ఆర్డీవో కిషన్ కోరారు. మంగళవారం ఆయన మండలంలోని కాజిపల్లిలో ఉపాధి హామీ పథకం పనులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కొందరు పట్టించుకోవడం లేదని, ఓటు కోల్పోతున్నామని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు గురికావద్ద ని కోరారు. కాగా, ఉపాధి పనులు గ్రామాల్లో ఉధృతంగా సాగుతున్నాయని, ప్రతీ కూలీకి కూలి రేట్లు ప్రభుత్వం పెంచిందని అన్నారు. గతంలో రూ.270 ఉండగా ఇప్పుడు రూ.300 చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధారాథోడ్, అధికారులు పాల్గొన్నారు.