
దిగుబడిని పరిశీలిస్తున్న అధికారులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో స్థానిక రైతు బెంబడి గురువయ్య సాగు చేసిన వరి పంటను సోమవారం రాష్ట్ర అర్థగణాంక శాఖ జాయింట్ డైరైక్టర్ పి.రవీందర్‌రెడ్డి, ఉపగణాంక అధికారి డి.శ్రీకాంత్, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి జి.సత్యం, జిల్లా వ్యవసాయాధికారి జి.కల్పన పరిశీలించారు. పంట పొలంలో ఐదు మీటర్ల పొడువు, ఐదు మీ టర్ల వెడల్పు విస్తీర్ణంలో పంట కోత ప్ర యోగం చేశారు. పంట కోత ద్వారా మొత్తం 19.855 కిలోగ్రాముల ధాన్యం దిగుబడి వ చ్చిందని గుర్తించారు. వరిపంట దిగుబడిని అంచనా వేసుకుని పంట సాగుకు జాగ్రత్తలు తీసుకుని అధిక దిగుబడి సాధించేలా రైతులు కృషి చేయాలని అన్నారు. ఈ కా ర్యక్రమంలో హాజీపూర్ మండల వ్యవసాయాధికారి మార్గం రజిత, జిల్లా ఉప గణాంక అధికారి ఎన్.పాపయ్య, మండల ప్రణా ళిక, గణాంక అధికారి పి.రమేశ్, వ్యవసాయ విస్తరణ అధికారి కనకరాజు పాల్గొన్నారు.