
ఓసీ నుంచి రైల్వేలైన్‌కు తరలిస్తున్న మట్టి
కాసిపేట: సింగరేణి సంస్థకు చెందిన ఓపెన్‌కాస్టుల నుంచి ప్రజావసరాలకు మినహా కాంట్రాక్టు పనులకు మట్టి తరలించే అవకాశం లేకున్నా మందమర్రి ఏరియాలోని కేకే ఓపెన్‌కాస్టు నుంచి రైల్వే కాంట్రాక్టు పనులకు భారీ వాహనాల్లో తరలిస్తున్నారు. గత మూడు రోజులుగా మట్టిని తరలించడం చర్చనీయాంశంగా మారింది. మట్టిని విక్రయించడం, ఇవ్వడం మైనింగ్ నియమాల్లో లేదు. సింగరేణి అధికారులు అనుమతులు ఉన్నాయని తెలుపగా సింగరేణి మైనింగ్ ఏరియాలో అనుమతులు ఇస్తే తీసుకున్న వారు రాయల్టీ ఎవరికి కట్టాలి, సింగరేణికి మట్టిని అమ్మి డబ్బులు తీసుకునే హక్కులేదు. మైనింగ్ ఏరియాలో ఎన్ని క్యూబిక్ మీటర్లు తరలించింది ఎవరు నమోదు చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.