
పూలే విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న అధికారులు
బెల్లంపల్లి: మందమర్రి ఏరియా శాంతిఖని గనిపై ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని బీసీ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు. జ యంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సింగరేణి కాలరీస్‌లోనే ప్రప్రథమంగా శాంతిఖని గనిపై జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఆవిష్కరించ డం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి బీసీ అసోసియేషన్ సలహాదారు చిలుక శ్రీనివాస్, ఆర్‌జీ రీజియన్ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు మధుకుమార్, మందమర్రి ఏరియా అధ్యక్షుడు ఆర్.విజయప్రసాద్, శాంతి ఖని గౌరవ అధ్యక్షుడు రాజు, అధ్యక్షుడు బి.వెంకటేష్, ఉపాధ్యక్షుడు డి.రమేష్, కోశాధికారి కె. రమేష్, డి.నాగవర్ధన్, శాంతిఖని గని ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, అధికారులు, ఉ ద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.