ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య | Hyderabad: A software engineer died who got cheated by lover | Sakshi
Sakshi News home page

ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

Published Wed, Sep 13 2023 12:02 AM | Last Updated on Wed, Sep 13 2023 11:06 AM

- - Sakshi

హైదరాబాద్: పురుగుల మందు తాగి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెహ్రూనగర్‌లో కొంతకాలంగా మౌనిక (23) తన స్నేహితురాలు సౌమ్యతో కలిసి ఉంటుంది. మౌనిక మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. కాగా ఇటీవలే సౌమ్య తన సొంతూరికి వెళ్లగా మౌనిక గదిలోనే ఉంది. మౌనిక స్వస్తలం మంచిర్యాల.

తమ తల్లిదండ్రులు ఫోన్‌ చేయగా మౌనిక నుంచి స్పందన రాకపోవడం చుట్టు పక్కల వాళ్లకు ఫోన్‌ చేసి ఆరా తీసారు. తెలిసిన వ్యక్తి మంగళవారం ఉదయం వెళ్లి చూడగా గది తలుపులు తెరచి ఉన్నాయని, మౌనిక స్మృహలో లేదని తెలిపాడు. పక్కనే పురుగల మందు బాటిల్‌ కూడా ఉందని తెలిపాడు. వెంటనే 108కి ఫోన్‌ చేయగా సిబ్బంది వచ్చి చూసి చనిపోయిందని తెలిపారు.

ప్రేమే కారణమా..?
2 నెలల క్రితం ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని మౌనిక తెలిపిందని దీనికి అంగీకరించకపోవడంతో తమతో మాట్లాడడం లేదని తల్లిదండ్రలు తెలిపారు. కాగా ఆ అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని మౌనిక తమతో తెలిపిందన్నారు. ఈ విషయంపైనే తమ కూతురు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మౌనిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement