రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట

Jun 23 2023 1:28 AM | Updated on Jun 23 2023 8:37 AM

చెన్నూర్‌: బహిరంగ సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పరుషోత్త రూపాల - Sakshi

చెన్నూర్‌: బహిరంగ సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పరుషోత్త రూపాల

చెన్నూర్‌: కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని కేంద్ర పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రూపాలా అన్నారు. తొమ్మిదేళ్ల మహా సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం చెన్నూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014లో దేశంలో అవినీతి రాజ్యమేలిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేకుండా చేశారని అన్నారు. రైతులకు ఏటా రూ.18 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నారని తెలిపారు. మత్స్యశాఖ వారి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందిస్తామని చెప్పారు.

రాష్ట్రానికి కేంద్రం అనేక నిధులు మంజూరు చేసిందని, ఇక్కడ మాత్రం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నేటికీ ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం ఆలయానికి ప్రత్యేకత ఉందని, కాళేశ్వరం పేరుతో ప్రజలకు అన్యాయం చేయడాన్ని దేవుడు క్షమించడని తెలిపారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పా లన సాగుతోందని విమర్శించారు. గోదావరి పరిరక్షణ కోసం చెన్నూర్‌ గోదావరి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

అనంతరం మండలంలోని గంగారం, అస్నాద్‌ గ్రామాలకు చెందిన ఇద్దరు వార్డు సభ్యులతోపాటు పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎరబెల్లి రఘునాథ్‌రావు, బెల్లంపల్లి ఇన్‌చార్జి ఏమాజీ, ప్రభాకర్‌, జిల్లా నాయకులు వెంకటేశ్వర్‌గౌడ్‌, సుశీల్‌కుమార్‌, చింతల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

గడప గడపకు బీజేపీ ప్రచారం ప్రారంభం
తాండూర్‌:
మండల కేంద్రంలో గురువారం గడపగడపకు బీజేపీ ప్రచారాన్ని కేంద్రమంత్రి పరుషోత్తం రూపాల ప్రారంభించారు. విద్యాభారతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎఫ్‌సీఐ సభ్యుడు పుల్గం తిరుపతి, నాయకులు కృష్ణదేవరాయలు, శ్రీవాణి, చిరంజీవి, సంతోష్‌, విష్ణు, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం
బెల్లంపల్లిరూరల్‌:
మండలంంలోని కన్నాల శివారులో ఉన్న బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల వి మర్శించారు. గురువారం సాయంత్రం ఆయ న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు గుట్ట ల నడుమ అటవీ ప్రాంతంలో ఆలయం ఎంతో విశాలంగా ఉందని తెలిపారు. అనంతరం ఆయనను బెల్లంపల్లి బీజేపీ నాయకులు శా లువాతో ఘనంగా సన్మానించారు. బీజేపీ జి ల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, జిల్లా అధి కార ప్రతినిధి శ్రీకృష్ణదేవరాయలు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటకృష్ణ, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్‌ రాచర్ల సంతోష్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement