ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు అనధికారికంగా వెలిసిన దుకాణాలపై ఎకై ్సజ్ శాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. లైసెన్స్డ్ దుకాణాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు నామమాత్రంగా రెండు కేసులు నమోదు చేసి.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. 117 లీటర్ల మందు కల్లును ధ్వంసం చేసి చేతులు దులుపుకొన్నారు. దీనిపై ఎకై ్సజ్ శాఖకు చెందిన ఓ అధికారిని సంప్రదించగా.. ‘ఇటీవలే ఎకై ్సజ్ సిబ్బందితో సమావేశం నిర్వహించాం. అనధికారికంగా వెలిసిన కల్లు దుకాణాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.’ అని సమాధానమిచ్చారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా కల్లు మాఫియా పేట్రేగిపోతోంది. బెల్ట్ షాపుల మాదిరిగా గల్లీగల్లీలో అనధికార కల్లు దుకాణాలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తుండగా.. వాటి కేంద్రంగా మందు కల్లు దందా యథేచ్ఛగా సాగుతోంది. తాటి, ఈత, ఖర్జూర వనాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన కల్లుకు బదులుగా.. నిషేధిత అల్ప్రాజోలం, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్) వంటి ప్రమాదకర మత్తు పదార్థాలను కలిపిన కృత్రిమ కల్లును మాఫియా ఏరులై పారిస్తోంది. కళ్లెదుటే అనుమతుల్లేకుండా వాడవాడలా వె లుస్తున్న దుకాణాలపై ఎకై ్సజ్ శాఖ నామమాత్రపు చర్యలతో సరిపెడుతుండడం విమర్శలకు తావిస్తోంది.
60 శాతం అనధికార దుకాణాలే..
ఆబ్కారీ శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో రిజస్టర్డ్ కల్లు సొసైటీల షాపులు 378, కల్లు డిపోలు 21 ఉండగా.. దీని పరిధిలో 93 దుకాణాలకే కల్లు విక్రయించేందుకు అనుమతులు ఉన్నాయి. ఈ లెక్కన మొత్తం 471 దుకాణాలకు లైసెన్స్ ఉంది. ఈ అధికారిక లైసెన్స్ దుకాణాలకు మించి అనధికారికంగా మరో 600 వరకు దుకాణాలు వెలిసినట్లు తెలుస్తోంది. అంటే ఎలాంటి అనుమతులు లేకుండా 60 శాతానికి పైగా కల్లు దుకాణాలు వార్డులు, డివిజన్లు, గ్రామాల వారీగా విస్తరించాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఐదారేళ్లలో రూ.5 కోట్ల వ్యయంతో ఏడెనిమిది లక్షల మేర తాటి, ఈత మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నా.. ఆ సంఖ్య వేల లోపే ఉంది. మొత్తంగా 75 శాతానికి పైగా మందు కల్లు విక్రయాలే జరుగుతున్నాయి.
‘మామూళ్ల’తో ముకుతాడు..
ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో ఇద్దరు వ్యాపారులు మందు కల్లు మామ్లాను శాసిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఇరువురు పోటాపోటీగా అధికారిక, అనధికారిక దుకాణాల ద్వారా దందా నడిపిస్తున్నారు. ‘అధికార’ యంత్రాంగం నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా.. పలు ప్రభుత్వ విభాగాలకు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఇందులో ఎకై ్సజ్ శాఖకు నెలనెలా పెద్ద మొత్తంలో ఆమ్యామ్యాలు అందుతున్నట్లు వినికిడి. ఓ వ్యాపారి నుంచి నెలకు రూ.1.50 లక్షలు, మరో వ్యాపారి నుంచి రూ.2.25 లక్షల వరకు ముడుపులు చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇతర విభాగాల వారికి పండుగల వారీగా కొంత మొత్తం నజరానాగా ఇస్తున్నట్లు ప్రచారం. ఇదే పరిస్థితి ఉమ్మడి పాలమూరులోని మిగిలిన నాలుగు జిల్లాల్లోనూ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


