చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో గురువా రం ఉదయం ముందుగా అర్చకులు ఆలయా న్ని శుద్ధి చేసిన అనంతరం భక్తులకు స్వామివారం దర్శనం కల్పించారు. భక్తులు మెట్లపై కొబ్బరికాయలు కొట్టి గోవింద నామస్మరణ చేస్తూ స్వామి చెంతకు చేరి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు నైవేద్యం పెట్టి.. తలనీలాలు సమర్పించి వేడుకున్నారు. అలాగే అలివేలు మంగమ్మ, ఉద్దాల మండపం, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణా ల్లో వివిధ వస్తువులను కొనుగోలు చేశారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ బాలరాజు, ఈఓ మధనేశ్వరెడ్డి పటిష్ట చర్యలు చేపడుతున్నారు.
ఉత్సాహంగా
బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గురువారం అండర్–17 ఎస్‌జీఎఫ్ ఉమ్మడి జిల్లా బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. సంగారెడ్డిలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పెటాటీఎస్ జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌గౌడ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ముసాయిదా పత్రాలు దహనం చేసి నిరసన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, సూపర్‌వైజర్ విభాగాల కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన ఆందోళన ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా గురువారం టెండర్ నోటిఫికేషన్–2022 నుంచి అమలులో ఉన్న ముసాయిదా నమూనా కాపీలను నెత్తిన మోస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంజీజీహెచ్ ప్రాంగణంలో కాలం చెల్లిన ఏజెన్సీ టెండర్ ముసాయిదా పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో జీవితాలు సాగిస్తున్న కాంట్రాక్టు కార్మికులపై ప్రభుత్వానికి కనికరం లేదా అని ప్రశ్నించారు. ఎలాంటి కాలయాపన చేయకుండా కనీస వేతనం రూ.26 వేలకు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.


