మూగజీవాల సంరక్షణకు ముందస్తు టీకా | - | Sakshi
Sakshi News home page

మూగజీవాల సంరక్షణకు ముందస్తు టీకా

Nov 20 2026 1:13 AM | Updated on Nov 20 2026 1:13 AM

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): జిల్లాలో గొర్రెలు, మేకలను మశూచి (షీప్‌ పాక్స్‌, గోట్‌ పాక్స్‌) వ్యాధి నుంచి కాపాడేందుకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక టీకాల కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు బుధవారం నుంచి ఈ నెల 27 వరకు జిల్లావ్యాప్తంగా పదిరోజులపాటు టీకాలు వేయనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 17 మండలాల్లో 53 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 3,29,100 గొర్రెలు, మేకలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 2,97,600 గొర్రెలకు షీప్‌ పాక్స్‌ టీకాలు, 31,500 మేకలకు గోట్‌ పాక్స్‌ టీకాలు వేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. గ్రామాల వారీగా పశువుల వివరాలను సేకరించి ప్రత్యేక బృందాల ద్వారా టీకాలు వేయిస్తున్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు.

● మశూచి వ్యాధుల బారిన పడితే గొర్రెలు, మేకల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంతోపాటు పశుసంపదను కాపాడేందుకు ముందస్తు టీకాలు ఎంతో కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. పశుపోషకులు తమ జీవాలకు తప్పనిసరిగా టీకాలు వేయించి, సిబ్బందికి సహకరించాలని సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్ణీత లక్ష్యాన్ని పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శివానందస్వామి తెలిపారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ గొర్రెలు, మేకలకు టీకాలు వేయించుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement