నాలుగేళ్లయినా మారని రికార్డులు! | - | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లయినా మారని రికార్డులు!

Nov 20 2026 1:13 AM | Updated on Nov 20 2026 1:13 AM

ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేశాం

దేవరకద్ర రూరల్‌: ప్రభుత్వ రికార్డుల్లో తప్పులు సరిదిద్దేందుకు ఏళ్ల తరబడి సమయం పడుతోందా? కొత్త మండలాలు ఏర్పాటైనా సంబంధిత శాఖల రికార్డుల్లో మాత్రం పాత వివరాలే కొనసాగుతున్నాయా? తాజాగా పంపిణీ చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. 2022లోనే ప్రత్యేక మండలంగా ఏర్పాటై గెజిట్‌ విడుదలైన కౌకుంట్లకు సంబంధించిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో మాత్రం దేవరకద్ర మండలంగా ముద్రించారు. అంతేకాకుండా కౌకుంట్ల పిన్‌కోడ్‌ 509219కు బదులుగా దేవరకద్ర పిన్‌కోడ్‌ 509204 ను నమోదు చేశారు. మండలం పేరుతోపాటు పిన్‌కోడ్‌లోనూ తప్పులు దొర్లడంతో అధికారుల నిర్లక్ష్యమా.. శాఖల మధ్య సమన్వయ లోపమా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవా?

రేషన్‌ కార్డులు కేవలం నిత్యావసర సరుకులకే పరిమితం కావడం లేదు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు,ఇతర సేవలకు చిరునామా ధ్రువీకరణ ప త్రంగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్డు ల్లో మండలం, పిన్‌కోడ్‌ వివరాలు తప్పుగా నమోదై తే భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు ఎదుర య్యే అవకాశం ఉంది. ఆధార్‌, ఓటరు కార్డు, బ్యాంకు ఖాతాలు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఇతర ప్రభుత్వ పథకాల దరఖాస్తుల సమయంలో చిరునా మా వివరాల సరిపోలిక సమస్యగా మారవచ్చు. ము ఖ్యంగా మండలం, పిన్‌కోడ్‌ మధ్య వ్యత్యాసంతో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరిగే అవ కాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గెజిట్‌లో కౌకుంట్ల.. కార్డుల్లో దేవరకద్ర

మండలం పేరుతో పాటుపిన్‌కోడ్‌లోనూ తప్పులు

2022లోనే ప్రత్యేక మండలంగాఏర్పాటు.. గెజిట్‌ విడుదల

పాత వివరాలతో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

ఈ విషయంపై తహసీల్దార్‌ సుందర్‌రాజ్‌ను వివరణ కోరగా.. గతంలో రేషన్‌ కార్డుల ఆన్‌లైన్‌ లాగిన్‌లో కౌకుంట్ల మండలం పేరు అప్‌డేట్‌ కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ రికార్డుల నవీకరణ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. అయితే ఇప్పటికే పంపిణీ చేసిన కార్డుల్లో తప్పుగా నమోదైన మండలం పేరు, పిన్‌కోడ్‌ను సరిచేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement