అయ్యప్ప భక్తుల కోసం...
ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి
● శ : శబరిమల ● శ్రీ: శ్రీశైలం
● అ: అరుణాచలం ● పం: పంచారామం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కార్తీక మాసం ఆరంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ప్రధానంగా నెల రోజుల పాటు ప్రజలు వివిధ ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. వీరిని తమ వైపు తిప్పుకొనేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా భక్తులు, ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడపాలని నిర్ణయించింది. మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి శబరిమల, శ్రీశైలం, అరుణాచలం తదితర ప్రాంతా లకు ప్రత్యేక బస్సులు నడపనుంది. ప్రజల అభీష్టం మేరకు పంచరామాలకు సైతం తగిన సంఖ్యలో బుక్ చేసుకుంటే బస్సులు పంపిస్తారు. ఆన్‌లైన్ ద్వారా (www.tgsrtcbus.in) టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. పేమెంట్లను గూ గుల్‌పే, ఫోన్ పేలో చెల్లించవచ్చు. ఈ టికెట్ల బుకింగ్ కోసం ఇప్పటికే రీజియన్ వ్యాప్తంగా ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ప్రతి విలేజి బస్సు ఆఫీసర్ కూడా ఈ ప్రత్యేక బస్సులను బుక్ చేస్తారు. ముఖ్యంగా శబరిమలకు అవసరమైన వారికి అద్దెకు సైతం ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
● ఇక శ్రీశైలం వెళ్లేందుకు ఇప్పటివరకు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట మీదుగా రోజూ గంటకు ఒక బస్సు ఉండగా.. ప్రస్తుతం కార్తీక మాసం ఆరంభం కావడంతో ఏకంగా అర గంటకు ఒకటి నడిపిస్తున్నారు. వీటిలో ఐదు డీలక్స్ బస్సులను కొత్తగా ఈ రూట్‌లో ప్రవేశపెట్టారు. అలాగే గద్వాల నుంచి రెండు డీలక్స్ బస్సులు వనపర్తి మీదుగా ఉదయం 5.30, 7.30 గంటలకు నడిపిస్తున్నారు.
● కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణ చాలా పవిత్రమైనందున ఈనెల 23వ తేదీ సాయంత్రం మహబూబ్‌నగర్, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్ నుంచి మూడు సూపర్‌లగ్జరీ బస్సులు బయలుదేరుతాయి.
కురుమూర్తి జాతరకు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుమూర్తి జాతర ఎంతో ప్రసిద్ధి. దీనికి మన జిల్లాయే కాకుండా హైదరాబాద్ నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఉద్దాల మహోత్సవం సందర్భంగా ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 3, సాయంత్రం 4, 5, 6 గంటలకు హైదరాబాద్ నుంచి ఆరాంఘర్ మీదుగా నాలుగు బస్సులు నడపనున్నారు.
డిపోల వారీగా ప్రత్యేక బస్సుల వివరాలు
డిపో శ శ్రీ అ పం
అచ్చంపేట 4 0 1 1
గద్వాల 6 1 0 0
కల్వకుర్తి 4 0 0 0
కొల్లాపూర్ 4 0 0 0
మహబూబ్‌నగర్ 10 4 2 0
నాగర్‌కర్నూల్ 10 0 2 1
నారాయణపేట్ 6 4 0 0
షాద్‌నగర్ 6 0 0 1
వనపర్తి 10 4 0 0
ప్రత్యేక బస్సులను బుక్ చేసుకునేందుకు
సంప్రదించాల్సిన ఆయా డిపో మేనేజర్ల నంబర్లు
మహబూబ్‌నగర్ 99592 26286
అచ్చంపేట 99592 26291
గద్వాల 99592 26290
కల్వకుర్తి 99592 26292
కొల్లాపూర్ 90004 05878
నాగర్‌కర్నూల్ 99592 26288
నారాయణపేట 99592 26293
షాద్‌నగర్ 9959226287
వనపర్తి 99592 26289
శబరిమలకు రూట్ తెలిసిన, అనుభవం కలిగిన సుశిక్షితులైన డ్రైవర్లను ఏర్పాటు చేస్తున్నారు. కేరళం రాష్ట్ర సరిహద్దు పన్ను మినహాయింపు ఆర్టీసీ బస్సులకు మాత్రమే ఉంటుంది.
బస్సు బుక్ చేసే గురుస్వామికి సీటు ఉచితం. ఒకటి కన్నా ఎక్కువ బస్సులు బుక్ చేస్తే, మిగతా వాటికి రూ.300, ప్రతి బస్సుకు నిత్యం కమీషన్ చెల్లిస్తారు.
ప్రతి బస్సులో ఇద్దరు వంట వారు, ఇద్దరు మణికంఠస్వాములు, ఒకరు లగేజి మోసేవారు, సీటు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు మార్గమధ్యంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
సౌకర్యవంతమైన అధునాతన బీఎస్–6 టెక్నాలజీ, ఎయిర్ సస్పెన్షన్ కలిగిన కొత్త బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు.
కార్తీక మాసం వేళ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు
ఆన్‌లైన్‌లోనూ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం
ప్రయాణికులకు రిజర్వేషన్‌తో పాటు అన్ని సౌకర్యాలు
శ్రీశైలం చేరుకోవడానికి డీలక్స్ సర్వీసులు
ఒకటి లేదా ఎక్కువ బస్సులు బుక్ చేసే వారికి రాయితీలు
అద్దెవి సైతం అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ
అధికారులు
ఇప్పటికే రీజియన్ వ్యాప్తంగా ప్రత్యేక సిబ్బంది
నియామకం
కార్తీక మాసంలో ప్రయాణికులు, భక్తుల సౌకర్యా ర్థం ఆయా పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఆలయా ల సందర్శనకు ఆర్టీసీ బ స్సుల్లో సురక్షితంగా ప్రయాణించవచ్చు. చార్జీలను ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉండేలా నిర్ణయించాం. ఆయా డిపోలలో సంప్రదించి టికెట్లు బుక్ చేయించుకోవాలి.
– పి.సంతోష్‌కుమార్, ఆర్టీసీ ఆర్‌ఎం,
మహబూబ్‌నగర్


