శాస్త్రోక్తంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు

Nov 18 2026 12:50 AM | Updated on Nov 18 2026 12:50 AM

● భక్తిశ్రద్ధలతో కురుమూర్తి స్వామికి చక్రస్నానం

● గురుడ వాహనంపై

ఊరేగిన స్వామివారు

చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి స్వామివారికి గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా కొనసాగింది. స్వామివారి ప్రధాన ఆలయం నుంచి పుష్కరిణి వరకు కొనసాగిన సేవలో సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్నంటాయి. అనంతరం ఆలయ పూజారులు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లకు వేద మంత్రోచ్ఛారణలతో చక్రస్నానం చేయించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మార్మోగిన గోవిందనామస్మరణ..

కురుమూర్తిస్వామి జాతరకు మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉద్దాల ఉత్సవం తర్వాత జాతర మొదటి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. మెట్లపై కొబ్బరి కాయలు కొట్టి, స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు భక్తులు కొండ దిగువన దాసంగాలు పెట్టి, తమ కుటుంబాలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. తమ ఇంటి ఇలవేల్పుకు గండదీపాలు మోశారు. అనంతరం కొండపైన అలువేలు, మంగమ్మ, ఆంజనేయస్వామి, ఉద్దాల మండపం, చెన్నకేశవస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ బత్తుల బాల్‌రాజు, ఈఓ మధనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మహిపాల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, భరత్‌రెడ్డి, అర్జున్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement