గిట్టుబాటు ధర అడిగితే దాడి చేశారు | - | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధర అడిగితే దాడి చేశారు

Nov 18 2026 12:50 AM | Updated on Nov 18 2026 12:50 AM

● పోలీసులకు ఫిర్యాదు చేసిన

బాధిత రైతులు

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యా ర్డులో విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో మార్కెట్‌యార్డు కార్యాలయంలో సంబంధిత అధికారులను అడిగేందుకు వెళ్లిన తమపై వ్యాపారులు దాడి చేశారని బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం మేరకు..తిమ్మాజిపేట మండలం ఆర్‌సీ తండాకు చెందిన పాత్లావత్‌ శంకర్‌ పండించిన 30బస్తాల ధాన్యాన్ని అమ్మేందుకు బాదేపల్లి యార్డుకు తీసుకొచ్చాడు. అయితే క్వింటా రూ.2800 ధర రావడంతో తనకు సరైన గిట్టుబాటు ధర రాలేదని భావించి సమస్యను యార్డు కార్యాలయంలోని అధికారులకు విన్నవించేందుకు వెళ్లాడు. అయితే అక్కడ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది మధ్యాహ్న భోజనానికి వెళ్లడంతో అక్కడ కూర్చున్న ఇద్దరు వ్యాపారులు రైతును దూషించడంతో మాటామాటా పెరగి గొడవకు దారి తీసింది. వ్యాపారులు తనపై దాడి చేయడంతో గొంతుపై గాయమైందని బాధిత రైతు శంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతోపాటు తన బంధువు బోజ్యపై కూడా ఇరువురు వ్యాపారులు దాడి చేసి కొట్టారని పేర్కొన్నారు. తమపై దాడి చేసిన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

బైక్‌ ప్రమాదంలో

గాయపడిన వ్యక్తి మృతి

అమరచింత: బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న చెన్నప్ప (35) మంగళవారం మృతి చెందాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం కొంకన్వానిపల్లికి చెందిన చెన్నప్ప గత నెలలో అమరచింత శివారులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద జరిగిన బైక్‌ ప్రమాదంలో గాయపడ్డాడు. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి వెల్లడించారు.

రోడ్డు దాటుతుండగా బస్సు డ్రైవర్‌ దుర్మరణం

జడ్చర్ల: జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన జడ్చర్లలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌లోని రాజేంద్రనగర్‌కు చెందిన షేక్‌ అప్సర్‌ పాషా (57) జమ్‌ జమ్‌ హోటల్‌ ఎదుట రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు షేక్‌ అష్రాఫ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాదర్‌ తెలిపారు.

గురుకులం

విద్యార్థి అదృశ్యం

జడ్చర్ల: మండల పరిధిలోని పోచమ్మగడ్డ తండాలో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న కార్తీక్‌ అదృశ్యమైనట్లు ఎస్‌ఐ ఖాదర్‌ తెలిపారు. ఈ నెల 11న విద్యాసంస్థలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రిన్సిపాల్‌ అతడిని రెండు వారాల పాటు సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలో విద్యార్థి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement