వరుణ్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి | - | Sakshi
Sakshi News home page

వరుణ్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

Nov 18 2026 12:50 AM | Updated on Nov 18 2026 12:50 AM

విచారణాధికారిగా వనపర్తి డీఎస్పీ..

● జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి

సమక్షంలో ప్రక్రియ

● ముగ్గురు డాక్టర్ల బృందంతో

పకడ్బందీగా పోస్టుమార్టం

● వరుణ్‌ తల్లి ఫిర్యాదు

మేరకు కేసు నమోదు

జడ్చర్ల: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన చోరీ కేసు నిందితుడు వరుణ్‌ మృతదేహానికి మంగళవారం జడ్చర్ల ప్రభుత్వ ఏరి యా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. జడ్చ ర్ల కోర్టు న్యాయమూర్తి మహ్మద్‌ ముదాసర్‌ సమక్షంలో ముగ్గురు డాక్టర్ల బృందం పోస్టుమార్టం ప్రక్రియ ను పకడ్బందీగా పూర్తిచేసింది. ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో తీవ్ర అస్వస్థతకు గురైన వరుణ్‌ను చికిత్స కో సం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిన ట్లు పోలీసులు పేర్కొంటున్న నేపథ్యంలో మృతుడి తల్లి అరుణ, తదితర కుటుంబ సభ్యులు సోమవా రం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ కుమారుడి మరణానికి కారణమైన ఎస్‌ఐ జయప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయి తే కేసు నమోదు చేయడంలో తాత్సారం చేస్తున్నార ని మృతుడి తల్లి, ఇతర కుటుంబ సభ్యులు పోస్టుమార్టానికి సహకరించలేదు. ఈ క్రమంలో ఆమె ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించడంతో మంగళవారం రాత్రి పోస్టుమార్టం ప్ర క్రియ పూర్తయింది. అనంతరం మృతదేహాన్ని కు టుంబ సభ్యులకు అప్పగించారు. జడ్చర్ల కోర్టు న్యా యమూర్తి సమక్షంలో డాక్టర్ల బృందం దాదాపు రెండు గంటలపాటు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ హించగా.. మొత్తం ప్రక్రియను వీడియో తీశారు.

హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు..

హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన వరుణ్‌ మృతికి సంబంధించి స్థానిక పోలీసులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు మృతుడి సోదరుడు అరుణ్‌ తెలిపారు. తన ఫిర్యాదుపై స్పందించిన హెచ్‌ఆర్సీ.. జిల్లా ఎస్పీ, తదితరులకు నోటీసులు జారీ చేసిందన్నారు. తమ సోదరుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

పోలీస్‌స్టేషన్‌లో వరుణ్‌ మృతి ఘటనకు సంబంధించి వనపర్తి డీఎస్పీ గిరిబాబును విచారణాధికారిగా నియమించినట్లు మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. పోస్టుమార్టం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా స్థానిక సీఐ కమలాకర్‌, ఎస్‌ఐ మల్లేష్‌ తదితర సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement