ధరూరు : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన మండల పరిధిలోని సంగాల రిజర్వాయర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గద్వాల పట్టణానికి చెందిన వెంకటేష్ తమ్ముడితో కలిసి బుధవారం చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో రిజర్వాయర్లో దిగగా ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని గల్లంతయ్యాడు. ఎంతకూ బయటకు రాకపోవడంతో గమనించిన తోటి జాలరులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు రేవులపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం పొద్దుపోయే వరకు గాలించినా ఆచూకీ లభించలేదు.
134.55 కేజీల
సీహెచ్ స్వాధీనం
అయిజ: జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ అనంతరెడ్డి నేతృత్వంలో బుధవారం అయిజ పట్టణంలో నిర్వహించిన దాడుల్లో 134.55 కేజీల సీహెచ్ (క్లోరల్ హైడ్రేట్)ను స్వాధీనం చేసుకున్నారు. సీహెచ్ విలువ ప్రభుత్వం లెక్కల ప్రకారం రూ.6 లక్షలు, బహిరంగ మార్కెట్లో రూ.12 లక్షలు ఉండొచ్చని ఎకై ్సజ్ అధికారులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని పట్టణానికి చెందిన రవీంద్రగౌడ్ను అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది హర్షవర్ధన్గౌడ్, హరీష్గౌడ్ పాల్గొన్నారు.


