చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

Nov 12 2026 1:01 AM | Updated on Nov 12 2026 1:01 AM

వనపర్తి రూరల్‌: బీసీ గురుకుల పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే జాతీయస్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉటుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా అండర్‌–17 క్రీడల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేతో పాటు డీసీఓ శ్రీవేణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే క్రీడాజ్యోతి వెలిగించి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటిని సాధించే దిశగా క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్రీడాకారులు ఉమ్మడి జిల్లా స్థాయిలో రాణించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటాలన్నారు. డీసీఓ శ్రీవేణి మాట్లాడుతూ.. ఈ పోటీల్లో 14 ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాలల నుంచి 490 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ గురువయ్యగౌడ్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, ప్రశాంతి, చిట్యాల తూర్పుతండా సర్పంచ్‌ సాలమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నా రు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement