అలంపూర్: జిల్లాలో సాగు చేసిన వాణిజ్య పంటలలో మిరప కూడా ఒకటి. అయితే మిరపకు కొమ్మ ఎండు తెగులు ఆశించే అవకాశం అధికంగా ఉంటుందని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి పేర్కొంటున్నారు. అల్టర్‌నేరియా అనే శిలీంధ్రం వలన ఈ కొమ్మ ఎండు తెగులు ఆశిస్తుందని తెగులు కారణంగా ముదురు కొమ్మల బెరుడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయని తెలిపారు. తర్వాత కొమ్మలు ఎండుతూ కిందికి వంగిపోతాయి. దీని వలన దాదాపు 50 శాతం వరకు పంట నష్టం జరిగే అవకాశం ఉంటుందని వివరించారు. సస్యరక్షణతో కొమ్మ ఎండుతెగులును నివారించవచ్చని సూచిస్తున్నారు.
నివారణ
ఈ తెగులు గుర్తించిన వెంటనే ప్రోపికొనజోల్ 1 మి.లీను లీటర్ నీటిలో కలిపి లేదా డైపెన్‌కొనజోల్ 0.5 మి.లీ లీటర్ నీటిలో కలిపి లేదా కాపర్ హైడ్రాకై ్సడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
లద్దెపురుగు (లేదా) కాయతొలుచు పరుగు
మిరప పంట చిరుకాయ దశలో ఉన్నప్పుడు అక్కడక్కడ కాయ తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగు కాయలోకి ప్ర వేశించి కాయలోపలి పదార్థాన్ని తినడం వలన కాయ నాణ్యత పడిపోతుంది. కాయపై చిన్న చిన్న రంధ్రాలు చేసి ఈ పురుగుకాయ లోపలికి ప్రవేశిస్తుంది.
నివారణ
ఈ పురుగు నివారణకు వేప నునె 5 మి.లీ లేదా అసిఫేట్ 1.5 గ్రాములు, నువలురాన్ 1 మి.లీ లేదా ప్లుబెండమయిడ్ 0.3 మి.లీ లేదా క్లోరాంత్రినిపోల్ 0.3 మి.లీను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
పోషకాల పిచికారీ
పంటకు పోషకాలను అందించడానికి ఎకరానికి 30 కిలోల యూరియా, 20 కిలోల పోటాష్ ఎరువులు వేసుకోవాలి. పొలంలో తేమ అధికంగా ఉన్నప్పు డు 19:19:19 పోషకము 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది.
పాడి–పంట


