మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్టు

Nov 5 2026 1:10 AM | Updated on Nov 5 2026 1:10 AM

● 14 రోజుల రిమాండ్‌కు తరలింపు..మరో ముగ్గురి కోసం గాలింపు

మహబూబ్‌నగర్‌ క్రైం: భూ వివాదం నేపథ్యంలో గిరిజన మహిళ సునీత హత్యకు గురైన కేసులో ఇద్దరు నిందితులను కోయిలకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ గాంధీనాయక్‌ కేసు వివరాలు వెల్లడించారు. కోయిలకొండ మండలం చింతలతండాకు చెందిన కాట్రావత్‌ సునీత ఈ నెల 2న హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో నిందితులైన మణ్యనాయక్‌, పార్వతిని చింతలతండా సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించిందన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. సునీతకు పదేళ్ల క్రితం బలరాంతో వివాహం కాగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె పేరుమీద ఉన్న భూమి విషయంలో కొంతకాలంగా కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయని, భూమి వద్దకు రావొద్దంటూ పలుమార్లు బెదిరింపులు వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సీఐ తెలిపారు. ఈ నేపథ్యంలో ఐదుగురు కలిసి సునీతను హత్య చేసినట్లు సీఐ గాంధీ నాయక్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement