మార్కెట్‌లోకి ‘బేయాన్‌’ హ్యుందాయ్‌ కారు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘బేయాన్‌’ హ్యుందాయ్‌ కారు

Nov 5 2026 1:10 AM | Updated on Nov 5 2026 1:10 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: హ్యుందాయ్‌ మోటారు ఇండియా రూపొందించిన కొత్త ‘బేయాన్‌’ కారును బుధవారం స్థానిక ట్రెండ్‌ షోరూంలో గ్రూప్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ గట్టు శ్రీహర్షిత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక డిజైన్‌, ఆకర్షణీయమైన సువ్‌ డిజైన్‌, స్టైలిష్‌ ఫ్రంట్‌ గ్రిల్‌, లెడ్‌ లైటింగ్‌ సిస్టం, 120 పీఎస్‌ గరిష్ట పవర్‌ కలిగి ఉందన్నారు. 172 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌, అధునాతన టచ్‌స్క్రీన్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ప్రీమియం ఇంటీరియర్స్‌, సౌకర్యవంతమైన సీటింగ్‌ ఉందన్నారు. కార్యక్రమంలో సేల్స్‌ మేనేజర్‌ హర్షవర్ధన్‌రెడ్డి, సర్వీస్‌ మేనేజర్‌ మొహమ్మద్‌ వసీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement