మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో బుధవారం అండర్–17, అండర్–19 విభాగాల బాలబాలికల ఉమ్మడి జిల్లా రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాస్కెట్‌బాల్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడల్లో ఉమ్మడి జిల్లా జట్లు రాణించి చాంపియన్లుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు మొగులాల్, ముకర్రం, శైలజ, బాల్‌రాజు, నాగరాజు, రాజేష్, సీనియర్ క్రీడాకారుడు ఇలియాజ్ పాల్గొన్నారు.


