నేను బొమ్మను కాను.. గొల్లభామను..! | - | Sakshi
Sakshi News home page

నేను బొమ్మను కాను.. గొల్లభామను..!

Nov 5 2026 1:10 AM | Updated on Nov 5 2026 1:10 AM

ఇది చూడటానికి ఒక చెక్క బొమ్మలా ఉందనుకుంటే పొరపాటే. ఇది చెక్క బొమ్మ కాదు.. బతికున్న ఒక అరుదైన గొల్లభామ. పాలమూరు యూనివర్సిటీ ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ వద్ద కనిపించిన ఈ వింత కీటకం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది కీటకాల జాతికి చెందిన ‘ఆర్ర్‌థోపొడ’ వర్గానికి చెందినదని పీయూ జువాలజీ అధ్యాపకులు తెలిపారు. సాధారణంగా గొల్లభామలు ఆకుపచ్చ రంగులో పచ్చని చెట్ల మధ్య కనిపిస్తుంటాయి. కానీ, ఇలా ఎండిన ఆకుపచ్చ మరియు గోధుమ రంగు కలయికలో, ఎండిన కొమ్మలా కనిపించే గొల్లభామలు చాలా అరుదుగా ఉంటాయని వారు పేర్కొన్నారు. దీని శాసీ్త్రయ నామం గొంగిలస్‌ గొంగిలోడ్స్‌ అని.. ప్రపంచవ్యాప్తంగా దీనికి ది వాండరింగ్‌ వయోలిన్‌ మాంటిస్‌ లేదా ఇండియన్‌ రోజ్‌ మాంటిస్‌ అనే పేరు ఉంది. దక్షిణ భారతదేశంలో అరుదుగా కనిపించే ఈ జీవి, గాలికి ఎండుటాకు కదిలినట్లుగా తన శరీరాన్ని అటు ఇటు ఊపుతూ కదలడం దీని ప్రత్యేకత. ఇవి నేలపై ఎండుటాకుల మధ్య ఉంటూ, శత్రువుల కంటికి కనపడకుండా మభ్యపెడుతుంటాయి. తమ పరిసరాల్లోకి వచ్చే చిన్న చిన్న కీటకాలను, పురుగులను వేటాడి ఆహారంగా తింటాయని వివరించారు.

– మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement