చాంపియన్‌ మహబూబ్‌నగర్‌ | - | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ మహబూబ్‌నగర్‌

Nov 4 2026 1:50 AM | Updated on Nov 4 2026 1:50 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలో జరుగుతున్న 70వ స్కూల్‌ గేమ్స ఫెడరేషన్‌ రాష్ట్రస్థాయి అండర్‌–19 బాలుర క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ను ఆతిథ్య మహబూబ్‌నగర్‌ జట్టు కై వసం చేసుకుంది. టోర్నీలో మొదటి నుంచి వరుస విజయాలతో దూ సుకెళ్లిన మహబూబ్‌నగర్‌ జట్టు ఫైనల్‌లో కూడా అదే స్థాయిలో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచింది. నగర శివారు (అల్లీపూర్‌ సమీపం) మైదానంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 9 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. మహబూబ్‌నగర్‌ బౌలర్లు గగన్‌ 2, జశ్వంత్‌ 2 వికెట్లు, సిద్దార్థ, ఫైజాన్‌ చెరో వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ 7.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 70 పరుగులు చేసింది. బీరేందర్‌ 39 పరుగులు, రాంకుమార్‌ చారి18 పరుగులు చేశారు. ఇక ఎండీసీఏ మైదానంలో మూడోస్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మెదక్‌ వికెట్‌ తేడాతో రంగారెడ్డి జట్టుపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రంగారెడ్డి 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ 14.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది.

ఆటలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి

క్రీడాకారులు ఆటలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలని ఎండీసీఏ చీఫ్‌ ప్యాట్రన్‌, ప్రముఖ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎండీసీఏ మైదానంలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కోచ్‌లు చెపే సలహాలు, సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. క్రీడాకారులు ఉన్నతస్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ క్రీడల్లో అండర్‌–19 విభాగానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఓడిన వారు మళ్లీ గెలుపు కోసం పట్టుదలతో ఆడాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, అండర్‌–19 క్రికెట్‌ టోర్నీ పరిశీలకుడు విజయ్‌కుమార్‌, జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌, పెటాటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్‌, బాల్‌రాజు, శ్రీనివాస్‌, రాంమోహన్‌, మధుకుమార్‌, వినోద్‌కుమార్‌, రాఘవేందర్‌, నాగరాజు, రమణ పాల్గొన్నారు.

అంతకుముందు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు ఉత్కంఠంగా సాగాయి. తొలి సెమీస్‌లో మహబూబ్‌నగర్‌ 7 వికెట్ల తేడాతో మెదక్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. జట్టులో అభిరామ్‌ 34 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్‌ బౌలర్లు ఫైజాన్‌, జశ్వంత్‌, గగన్‌రెండుసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం మహబూబ్‌నగర్‌ 14.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జట్టులో అఫ్పాన్‌ (38 నాటౌట్‌) జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు.

రెండో సెమీస్‌లో హైదరాబాద్‌ 3 పరుగుల తేడాతో రంగారెడ్డి జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన రంగారెడ్డి జట్టు 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్‌ సాత్విక్‌ 3 వికెట్లు తీశాడు.

ఫైనల్‌లో 9 వికెట్ల తేడాతో

హైదరాబాద్‌పై గెలుపు

మూడో స్థానం మెదక్‌ జట్టు

ముగిసిన రాష్ట్రస్థాయి అండర్‌–19

ఎస్‌జీఎఫ్‌ క్రికెట్‌ టోర్నీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement