● అనుమతి లేని మందులు, వైద్య వ్యర్థాల నిల్వపై చర్యలు
జడ్చర్ల టౌన్ (రాజాపూర్): రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెండు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.శ్రీనివాసులు మంగళవారం మూసివేశారు. ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా.. అధిక శక్తి కలిగిన యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్స్‌తో పాటు అనుమతి లేని మందుల నిల్వలను గుర్తించారు. అలాగే ఉపయోగించిన సిరంజీలు, సైలెన్ బాటిళ్లను రోజుల తరబడి నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం శాసీ్త్రయ పద్ధతిలో తొలగించాల్సి ఉండగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు రెండు కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తనిఖీల్లో ప్రోగ్రాం అధికారి డా. శివకాంత్, హెల్త్ ఎడ్యుకేటర్ హనుమంతు, సిద్దిక్ పాల్గొన్నారు.
రూ.30 లక్షల విలువైన టపాసుల పట్టివేత
జడ్చర్ల: దీపావళి పండుగను పురస్కరించుకుని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఓ పశువుల షెడ్డులో నిల్వ ఉంచిన రూ.30 లక్షల విలువ చేసే టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు జడ్చర్ల రూరల్ సీఐ మహేష్ తెలిపారు. సీఐ కథ నం మేరకు.. బాలానగర్ మండలంలోని మోతిఘనపూర్ గ్రామ శివారులో గల వ్యవసాయ క్షేత్రంలోని పశువుల షెడ్డులో అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో సోమవారం అర్ధరాత్రి పోలీసులు దాడు లు నిర్వహించారు. అక్కడి నుంచి టపాసులను రెండు డీసీఎంలలో హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుండడంతో వెంటనే డీసీఎంలను స్వాధీనం చేసుకుని జడ్చర్ల డీటీసీకి తరలించారు. యజమాని గుర్విందర్ సింగ్, కేర్‌టేకర్ సంతోష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


