క్రాస్‌ కంట్రీ పోటీల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

క్రాస్‌ కంట్రీ పోటీల్లో రాణించాలి

Nov 4 2026 1:50 AM | Updated on Nov 4 2026 1:50 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ క్రాస్‌ కంట్రీ పోటీలకు కర్ణాటకలోని మంగళూరు యూనివర్సిటీకి పీయూ విద్యార్థులు మంగళవారం బయలుదేరారు. ఈ మేరకు సీ్త్ర, పురుషుల జట్టు సభ్యులకు పీయూ వీసీ శ్రీనివాస్‌ ట్రాక్‌సూట్లు, షూ అందజేశారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు పోటీల్లో తమ ప్రతిభను కబర్చి యూనివర్సిటీకి గోల్డ్‌మెడల్‌ సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, పీడీ శ్రీనివాస్‌, కోచ్‌ శ్వేత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి అభినందన

పీయూ బీ ఫార్మసీ విద్యార్థిని హర్షితరెడ్డి జాగృతి యాత్ర 2026కు ఎంపికై నందుకు వీసీ శ్రీనివాస్‌ ఆమెను అభినందించారు. దేశవ్యాప్తంగా యువతలో పారిశ్రామిక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నిర్వహించే ఈ యాత్ర కోసం సుమారు 70వేల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటే అందులో 525 మంది ఎంపిక కాగా.. 12 రాష్ట్రాల గుండా 15 రోజుల పాటు 8 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయనున్నారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక యాత్రలో పీయూ విద్యార్థిని పాల్గొనడం గొప్ప విషయం అని, భవిష్యత్‌లో మరిన్ని యాత్రలు చేపట్టాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement