అచ్చంపేటలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

అచ్చంపేటలో ఉద్రిక్తత

Nov 4 2026 1:50 AM | Updated on Nov 4 2026 1:50 AM

అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో, ధర్నా

అచ్చంపేట: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి ఐదు రోజులకే మత్యువాత పడిన ఘటన అందరినీ కలిచివేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారనుకున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు చివరకు ఆమె ప్రాణాలను బలిగొన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన అచ్చంపేట పట్టణంలోని భవానీ ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. చివరకు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. బల్మూర్‌ మండలం పొలిశెట్టిపల్లికి చెందిన జుడ్డు పద్మ(40) గర్భం దాల్చినప్పటి నుంచి భవానీ ఆస్పత్రిలో వైద్య సేవలు తీసుకున్నారు. ఆమెకు భర్త జుడ్డు శేఖర్‌, 6ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఇదే క్రమంలో వైద్యపరీక్షల అనంతరం ఆమె డెలివరీ కోసం ఇదే అస్పతిలో చేరారు. ఈనెల 2న డిశ్చార్జి చేసే సమయంలో ఆమెకు అకస్మాత్తుగా బీపీ పెరడగంతో డాక్టర్లు అందుకు సంబంధించిన ఇంజెక్షన్‌ ఇచ్చినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటనే మరో అస్పత్రికి తరిలించారు. వైద్య పరీక్షలు న్విహించిన వైద్యులు పరస్థితి గమనించి హైదరాబాద్‌కు రెఫర్‌ చేశారు. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని అచ్చంపేటలో డెలివరీ చేసిన అస్పత్రి వద్దకు తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం 5:45గంటలకు ఆందోళనకు దిగారు. అనంతరం ఇక్కడ చోటుచేసుకున్న పరిణామాలతో పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని ప్రభుత్వ అస్పత్రితకి తరలించారు. పోలీసుల పరితీరును నిరసిస్తూ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతూ లింగాల చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట మధ్యాహ్నం 12గంటల వరకు ధర్నా, రాస్తారోకో చేపట్టారు.

అస్పత్రి ఎదుట ఆందోళన

మృతురాలు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అచ్చంపేటలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన చేశారు. అనంతరం లింగాల చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట సుమారు 4గంటలపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పద్మ మృతికి భవానీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మతదేహంతో ఆస్పత్రి ఎదుట నిరసన కొనసాగిస్తుండగా పోలీసులు, మృతురాలి బంధువులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వైద్యం వికటించిన బాలింత మృతి

ప్రైవేట్‌ అస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన, ఆగ్రహం

రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులతో

రాస్తారోకో, ధర్నా

ఆస్పత్రి ఎదుట ఆందోళన అనంతరం మృతు రాలి బంధువులు, వివిధ కులసంఘాల నా యకులు, ప్రతినిధులు, గ్రామస్తులు, మహిళ లు పెద్దసంఖ్యలో అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ రెండు గంటలకుపైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆందోళనకారులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement