వనపర్తి: పట్టణంలోని వివిధ ఆస్పత్రులకు అనుబంధంగా నిర్వహిస్తున్న మెడికల్ షాపులపై ఎస్‌ఏఎఫ్‌ఈ– డ్రగ్స్ వింగ్ అధికారులు విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన డిప్యూ టీ డైరెక్టర్ అంజుమ్ అబిద ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మెడికల్ షాపుల్లో ఔషధాల విక్రయానికి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశంతోపాటు, ఔషధాల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా షెడ్యూ ల్ హెచ్–1 ఔషధాల విక్రయ రిజిస్టర్లు, గడువు ముగిసిన మందుల నిల్వలు, ఔషధాల నిల్వ, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, లైసెన్సులు, ఇతర చట్టబద్ధమైన పత్రాలను తనిఖీ చేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మాత్రమే విక్రయించాల్సిన మందులను ని బంధనలకు అనుగుణంగా విక్రయిస్తున్నారా, గడువు ముగిసిన ఔషధాలను విక్రయానికి ఉంచకుండా ప్రత్యేకంగా వేరు చేస్తున్నారా అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ సందర్భంగా అధికారులు మా ట్లాడుతూ.. మెడికల్ షాపుల నిర్వాహకులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన మెడికల్ షాపుల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసు లు జారీ చేసి, వారి వివరణలను పరిశీలించిన అనంతరం చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా మెడికల్ షా పులపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఔష ధాల విక్రయంలో అక్రమాలు, నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని అధికారు లు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు సరిత (మహబూబ్‌నగర్), ప్రసాద్ (రంగారెడ్డి), వనపర్తి జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ రష్మితోపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


