ఉత్సాహంగా క్రికెట్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా క్రికెట్‌ టోర్నీ

Nov 2 2026 12:35 AM | Updated on Nov 2 2026 12:35 AM

● హోరాహోరీగా అండర్‌–19 లీగ్‌ మ్యాచ్‌లు

● దూసుకెళ్తున్న ఆతిథ్య

మహబూబ్‌నగర్‌ జట్టు

● 48 పరుగుల తేడాతో నల్లగొండపై

విజయం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: పాలమూరు నగరంలో 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్రస్థాయి అండర్‌–19 బాలుర క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ ఉత్సాహంగా కొనసాగుతుంది. ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానం, నగర శివారులోని (అల్లీపూర్‌ సమీపం) క్రికెట్‌ మైదానాల్లో లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాల జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. నగర శివారులోని మైదానంలో ఆదివారం రెండోరోజు మ్యాచ్‌లను జిల్లా ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్‌ ప్రారంభించారు. క్రీడాజట్లను ఆయన పరిచయం చేసుకొని మాట్లాడుతూ ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టోర్నీ రాష్ట్ర పరిశీలకుడు విజయ్‌కుమార్‌తోపాటు బాలరాజు, శ్రీనివాస్‌, అబ్దుల్లా, రాంమోహన్‌, సోహైల్‌, భానుకిరణ్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

33 పరుగులతో హైదరాబాద్‌ గెలుపు

మరో లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 33 పరుగుల తేడాతో వరంగల్‌ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. జట్టులో ధ్రువరెడ్డి 97 పరుగులు నాటౌట్‌, చాణక్య 35 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన వరంగల్‌ జట్టు 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ప్రీతమ్‌ 37, అభినవ్‌ 33 పరుగులు చేశారు.

● మరో మ్యాచ్‌లో వరంగల్‌ పది వికెట్ల తేడాతో ఖమ్మంపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఖమ్మం జట్టు 9 ఓవర్లలో 45 పరుగులకు ఆలౌట్‌ అయింది. మణిదీప్‌ 5 వికెట్లు, అనస్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన వరంగల్‌ జట్టు వికెట్‌ నష్టపోకుండా 6.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.

● మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు 6 వికెట్ల తేడాతో నల్లగొండపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన నల్లగొండ జట్టు 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు 4 వికెట్లకు 74 పరుగులు చేసింది.

ఆరు వికెట్ల తేడాతో మెదక్‌ గెలుపు

ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మెదక్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో అదిలాబాద్‌ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అదిలాబాద్‌ జట్టు 15 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన మెదక్‌ జట్టు 4 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో 109 పరుగులు చేసింది. చేతన్‌ 33 పరుగులు చేశాడు.

● మరో మ్యాచ్‌లో రంగారెడ్డి జట్టు 51 పరుగుల తేడాతో నిజామాబాద్‌ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రంగారెడ్డి జట్టు 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నిజామాబాద్‌ జట్టు 12 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.

మహబూబ్‌నగర్‌– నల్లగొండ మధ్య మ్యాచ్‌

బీరేందర్‌(యం.నగర్‌,

50 పరుగులు)

ఫైజాన్‌ (యం.నగర్‌,

5 వికెట్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement