చీడపీడల నివారణతో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

చీడపీడల నివారణతో అధిక దిగుబడి

Nov 2 2026 12:35 AM | Updated on Nov 2 2026 12:35 AM

అలంపూర్‌: పంట సాగులో చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తే అధిక దిగుబడి సాధించొచ్చు. వరి పంట సాగులో నారుమడి నుంచే సరైన యాజ మాన్య పద్ధతులు పాటిస్తే చీడపీడలను నివారించొచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి రైతులకు సూచించారు.

విత్తన శుద్ధి:

నారుమడి పోసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. తడి విత్తన శుద్ధిలో 1 కిలో విత్తనానికి 1 గ్రాము కార్భండిజం 1 లీటర్‌ నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండే కట్టి మొలకలను దంపనారు మడిలో చల్లుకోవాలి. విత్తన మో తాదు ఎకరాకు 20 నుంచి 25 కేజీలు సరిపోతుంది.

ఎరువుల యాజమాన్యం..

ఎకరాకు సరిపడే నారును 5 సెంట్లలో 2 కిలోల నత్రజని (5 కిలోల యూరియా), ఒక కిలో భాస్వరం (6కిలోల ఎస్‌ఎస్‌పీ), ఒక కిలో పొటాషియం (2 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) ఇచ్చే ఎరువులను నారు వేసిన ముందు చివర దమ్ములోనే వేసుకోవాలి. నత్రజని ఇచ్చే ఎరువులను తేలిక నేలల్లో అయితే రెండుసార్లు వేసుకోవచ్చు. ఒక కిలో నత్రజని విత్తనం చల్లే ముందు, మరో కిలో విత్తిన 12 నుంచి 14 రోజులకు వేయాలి.

50 కిలోల యూరియాకి 10 కిలోల వేప పిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిగానీ కలిపి రెండు రోజు లు నిల్వ ఉంచి పొలంలో వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. పొటాష్‌ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలిక భూము ల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగితా సగాన్ని వేయాలి. కాంప్లెక్స్‌ ఎరువులను పైపాటుగా దమ్ములోనే వేయడం మంచిది.

జింకు లోపం లక్షణాలు

పై నుంచి 3 లేక 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది.నాటిన 2 నుంచి 4 వారాల్లో ముదురాకు చివర్లో, మధ్య ఈనె కు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు చిన్నవిగా పెలు సుగా మారి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికి పైరు పచ్చగానే ఉండదు.

నివారణ..

ప్రతి సీజన్‌లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్‌ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్‌ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువుతో జింకు సల్ఫేట్‌ కలిపి వేయరాదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. జింకు సల్ఫేట్‌ ద్రావణంలో పురుగు, తెగుళ్ల మందులు కలిపి వాడరాదు. బోరు నీటిని వాడుతున్నట్లయితే ప్రతి రెండేళ్లకు ఒకసారి నీటి పరీక్ష చేయించాలి. ఒక వేళ నీటిలో ఉప్పు ఎక్కువగా ఉన్నట్లయితే క్లిష్టమైన దశలో ఈ నీటిని పంటకు ఇవ్వకుండా ఆపేయాలి.

దశ మోతాదు (ఎకరాకు)

చివరి దమ్ము యూరియా 35 కిలోలు

ఎస్‌ఎస్‌పీ 150 కిలోలు

పొటాష్‌ 30 కిలోలు

దుబ్బు చేసే దశలో యూరియా 35 కిలోలు

అంకురం దశలో యూరియా 35 కిలోలు

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement