దూసుకెళ్తున్న పాలమూరు జట్టు | - | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తున్న పాలమూరు జట్టు

Nov 2 2026 12:35 AM | Updated on Nov 2 2026 12:35 AM

దూసుకెళ్తున్న పాలమూరు జట్టు

ఆతిథ్య మహబూబ్‌నగర్‌ జట్టు టోర్నమెంట్‌లో దూసుకెళ్తోంది. రెండో లీగ్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 48 పరుగుల తేడాతో నల్లగొండపై విజయం సాధించింది. నగర శివారులోని మైదానంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. జట్టులో బీరేందర్‌ అర్ధ సెంచరీతో రాణించాడు. 32 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు, రామాచారి 35 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నల్లగొండ జట్టు మహబూబ్‌నగర్‌ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 12 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. మహబూబ్‌నగర్‌ బౌలర్‌ ఫైజాన్‌ 3 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement