భర్త వేధింపులుతాళలేక భార్య బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులుతాళలేక భార్య బలవన్మరణం

Nov 2 2026 12:35 AM | Updated on Nov 2 2026 12:35 AM

గట్టు: కట్టుకున్న భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని గొర్లఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన ఉప్పరి రాధ(35) భర్త ఉప్పరి భీమేష్‌ వేధింపులు భరించలేక గత నెల 28న పురుగు మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు రాధను కర్నూలు ఆస్పత్రికి తరలించగా..అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. రాధకు భర్తతోపా టు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు భర్త భీమేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌ తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తాపడి రైతు మృతి

ఎర్రవల్లి: జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ బోల్తాపడి రైతు మృతిచెందిన ఘటన కోదండాపురం పీఎస్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ తరుణ్‌ కుమార్‌ రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పుటాన్‌ దొడ్డికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి (35) తమ ట్రాక్టర్‌తో వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిపై వేముల స్టేజీ సమీపంలో వెళ్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడడంతో తీవ్ర రక్త గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో కర్నూల్‌ ఆస్పత్రికి తరలించగా డ్యూటీ డాక్టర్‌ వైద్యపరీక్షలు నిర్వహించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారని తెలిపారు. మృతిపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ పేర్కొన్నారు.

రైలుకిందపడి గుర్తుతెలియని యువకుడు..

దేవరకద్ర రూరల్‌: రైలుకిందపడి యువకుడు మృతిచెందిన ఘటన అదివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. దేవర కద్ర–కౌకుంట్ల రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే కిలోమీటర్‌ 139/15–16 వద్ద గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీ సులు అక్కడికి చేరుకొని మృతుడి వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు 19ఏళ్లు ఉంటుందని తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్‌ నోట్‌లో తన పేరు కె.మధుసూద న్‌, బాబాయి పేరు అశోక్‌గా రాసి ఉన్నట్లు వెల్లడించారు. అయితే స్వగ్రామం వివరాలు లభించలేదు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడిని గుర్తించినవారు 87126 58597 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని రైల్వే ఎస్‌ఐ కోరారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

నవాబుపేట: అక్రమంగా రేషన్‌బియ్యం తరలింపును కొందరు గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వాటిని స్వాధీంనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని అమ్మపూర్‌– లింగంపల్లి రోడ్డులో లారీలో తరలుతున్న సన్న బియ్యాన్ని అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్తులు అనుమానంతో అడ్డుకున్నారు. దీంతో లారీలో రవాణా చేస్తున్న బియ్యాన్ని పరిశీలించి రేషన్‌ దుకాణాల్లో ప్రజల కు అందించే సన్నబియ్యం అక్రమంగా తరలిస్తు న్నారని వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు.

దొడ్డు బియ్యం ముసుగులో..

బియ్యాన్ని తరలిస్తున్న కాంట్రాక్టర్‌ దొడ్డు బియ్యం ముసుగులో సన్నబియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఆదివారం తరులుతున్న బియ్యం లారీలో దొడ్డు బియ్యంతోపాటు 200బస్తాలకు పైగా రేషన్‌ దుకాణాల్లో సరఫరా చేసే సన్నబియ్యం ఉన్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో లారీని ఒక బొలేరోను అదుపులోకి తీసుకుని ఆరాతీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సివిల్‌ సప్లయి అధికారులతో విచారణ

బియ్యానికి సంబంధించి సివిల్‌ సప్లయి అధికారులు పరిశీలన చేసి విచారణ చేసిన అనంతరం రేషన్‌ సన్న బియ్యం ఉన్నట్‌లైయితే వారిపై కేసునమోదు చేసి చర్యలు తీసుకుంటామని అప్పటి వరకు పోలీసుల అదుపులోనే లారీ, బొలేరో ఉంటాయని ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement