మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరు నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా యోగా సీనియర్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఎంపికల్లో ఉమ్మడి జిల్లా నుంచి 40 మంది పురుషులు, మహిళలు పాల్గొన్నట్లు యోగా సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ముఖ్య అతిథులుగా డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా యోగా సంఘం వర్కింగ్ చైర్మన్ రాములు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల సందర్భంగా క్రీడాకారుల యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముత్యం గురుస్వామి, జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి రాంచందర్, మణికంఠ, నాగరాజు, సాగర్, బాలమణి తదితరులు పాల్గొన్నారు.


