నవాబుపేట: తన తల్లి అ నుమానాస్పదంగా మృతి చెందిందని ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని కుమారుడి ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమో దు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని తీగలపల్లికి చెందిన రంగు స్వరూప (46) ఆదివారం ఇంట్లో నీటి బకెట్‌లో పడి మృతి చెందారు. ఈ క్రమంలో ఆమె మృతిపై అనుమానం ఉందని తన తల్లి నీటి బకెట్‌లో తలమునిగి మరణించే అవకా శం లేదని కుమారుడు రంగు కుమార్ సోమవా రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి మరణానంతరం తల్లి తనతోనే ఉంటున్నారని కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే వారమన్నారు. కాగా ఆదివారం తాను పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి నీటి బకెట్‌లో తలమునిగి మృతి చెంది కనిపించారని వివరించారు. ఈ విషయంలో న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్ తెలిపారు.
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
మాగనూర్ (కృష్ణా): కృష్ణా మండల పరిధిలోని చేగుంట గ్రామ శివారులో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కృష్ణ ఎస్‌ఐ నవీద్ తెలిపిన వివరాల మేరకు.. చేగుంట గ్రామ శివారులోని రోడ్డు పక్కన గు ర్తు తెలియని వృద్ధుడు సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఏదైనా వాహనం ఢీకొట్టడం వల్ల చనిపోయాడా లేదా సాధారణంగానే చనిపోయా డా అనేది స్పష్టత లేదన్నారు. మృతుడు తెల్ల పంచ, ఎర్ర తువాల ధరించి ఉన్నాడని వయ సు 50–55 ఏళ్ల మధ్య ఉంటుందని ఎవరైన గుర్తు పడితే కృష్ణ పోలీస్‌స్టేషన్ నంబర్ 87126 71023ను సంప్రదించాలని సూచించారు.
డీసీఎం ఢీకొని వృద్ధుడి మృతి
ఉండవెల్లి: డీసీఎం ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడి మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేష్ వివరాల ప్రకారం మండలంలోని ఇటిక్యాలపాడు శివారులోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వృద్ధుడు(70) నడుచుకుంటు వెళ్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున వెనుక నుంచి గుర్తుతెలియని డీసీఎం వృద్ధుడిని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి అలంపూర్ మార్చురీలో మృతదేహాన్ని ఉంచారు. చామన చాయ, తెలుపు రంగులో గోధుమ రంగు డిజైన్ ఉన్న షర్ట్, తెలుపు రంగులో ఉన్న ఆకుపచ్చ, ఎరుపు రంగు కలిగిన అంచు ఉన్న పంచె, ఎరుపు గీతలున్న టవల్ భుజంపై ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు.
దైవదర్శనానికి వెళ్తూ
తిరిగిరాని లోకాలకు
కల్వకుర్తి రూరల్: వారంతా స్నేహితులు.. మూడు బైక్‌లపై ఆరుగురు హైదరాబాద్ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం బయలుదేరారు. దురదృష్టవశాత్తు కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని ఒంగోలు జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీకి చెందిన బండారు పవన్ (29) రంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. ఈనెల 25న సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో స్నేహితులు రాజు, నాగరాజు, సాయి, అనిల్, శ్రీకాంత్‌తో కలిసి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. రాత్రి 7:30 ప్రాంతంలో తాండ్ర సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో పవన్‌కు తీవ్రగాయాలై మృతిచెందగా వెనకాల కూర్చున్న రాజు గాయాలపాలయ్యారు. నాగరాజు సమాచారం ఇవ్వడంతో కల్వకుర్తికి వచ్చిన మృతిని సోదరుడు బాలమురళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తమ్ముడి మృతికి కారణమైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ఫిర్యాదు చేశాడు. బాలమురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
కల్వకుర్తి రూరల్: మండలంలోని రఘుపతిపేట మాజీ సర్పంచ్ రేణుక బాలస్వామి కుమారుడు ఉదయ్(22) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం దసరా రోజు తమ సొంత గ్రామమైన రఘుపతిపేట నుంచి కల్వకుర్తి వైపు భరత్‌కుమార్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం లింగసానిపల్లి గ్రామ సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అదేరోజు భరత్‌కుమార్ మృతిచెందగా తీవ్రంగా గాయపడిన ఉదయ్ కల్వకుర్తి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ సోమవారం మృతిచెందాడు. మృతదేహానికి కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి సోదరి ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.


