● ఇసుక అక్రమ తరలింపునకేనని
ఆరోపణలు
● అధికారుల నిర్లక్ష్యంపై
స్థానికుల ఆగ్రహం
● భూగర్భజలాలు తగ్గుతుండటంతో
రైతుల్లో ఆందోళన
మాగనూర్: నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుర్జాల గ్రామ సమీపంలోని కృష్ణానదిలో నీటి ప్ర వాహం తగ్గడంతో నది మధ్యలోకి వెళ్లేందుకు సు మారు కిలోమీటరున్నర మేర మట్టి రోడ్డు నిర్మిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలించేందుకే ఈ రహదారిని ఏర్పాటు చే స్తున్నారని, అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. నది పరివాహ క ప్రాంతంలో భారీ యంత్రాలు, జేసీబీలు, టిప్పర్ల వినియోగంపై నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా పగలు, రాత్రి తేడా లేకుండా పనులు చేపడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా సాగుతోందని ఆరోపిస్తున్నారు.
వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలమట్టాలు తగ్గుతుండటంతో నది పరివాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న వేసవిలో సాగు, తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నదిలోకి భారీ వాహనాలు వెళ్లేందుకు మట్టి రోడ్డు నిర్మిస్తుండటంపై పర్యావరణం, భూగర్భజలాలపై ప్రభావం పడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్జాల సమీపంలో జరుగుతున్న మట్టి రోడ్డు నిర్మాణంపై విచారణ జరిపి, అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయా అనేది పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఫిర్యాదు చేసిన ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


