రాజ్యాధికారం కోసం కృషి చేయండి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాధికారం కోసం కృషి చేయండి

Oct 27 2026 12:44 AM | Updated on Oct 27 2026 12:44 AM

చారకొండ: బీసీలంతా రాజ్యాధికారమే లక్ష్యంగా ఐకమత్యంతో పనిచేయాలని రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్‌ మల్లన్న అన్నారు. తీన్మార్‌ మల్లన్న పాదయాత్ర కల్వకుర్తి మండలంలో ముగించుకొని సోమవారం చారకొండ మండలంలోని జూపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా తీన్మార్‌ మల్లన్నకు స్థానిక బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తిమ్మాయిపల్లి, తుర్కలపల్లి గుండా పాదయాత్ర మండల కేంద్రానికి చేరుకుంది. రాత్రికి ఇక్కడే బస చేశారు. మంగళవారం ఉదయం చారకొండ మండల కేంద్రంలో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొని, దేవరకొండ వైపు పాదయాత్ర కొనసాగనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్య యాదవ్‌, నాయకులు భిక్షపతి, సిరాజ్‌, సత్యం యాదవ్‌, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

అత్తారింటికి వచ్చి తిరిగి వెళ్తూ దుర్మరణం

● బొలెరో ఢీకొని వ్యక్తి మృతి.. బాలుడికి తీవ్ర గాయాలు

జడ్చర్ల: అత్తగారి ఊరిలో గృహప్రవేశ విందుకు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జడ్చర్ల మండలంలోని చిన్న ఆదిరాల గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌ మండలానికి చెందిన దేవ (38) తన అత్తగారి ఊరైన తుపుడుగడ్డతండాలో బంధువుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ విందుకు హాజరయ్యాడు. అనంతరం మోటార్‌బైక్‌పై తిరిగి వెళ్తుండగా చిన్న ఆదిరాల సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో దేవ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న తుపుడుగడ్డతండాకు చెందిన శివ (15) తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య మౌనిక, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భిణి అని బంధువులు తెలిపారు. దేవ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement