జడ్చర్ల: నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న జడ్చర్లలో సోమవారం సాక్షాత్తు మాజీ డిప్యూటీ సీఎం ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. జడ్చర్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఓ వైపు 44 మరో వైపు 167 జాతీయ రహదారుల కలయిక వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ ట్రాపిక్ నియంత్రణకు ప్రతిరోజు కనీసంగా ఇద్దరు పోలీసులు ఉండాల్సిన పరిస్థితి. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మాజీ హోం మంత్రి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. ఓ దివ్యాంగురాలును మోటర్ బైక్‌పై దాటిస్తున్న క్రమంలో చిన్న ప్రమా దం చోటుచేసుకుంది. అప్పటికప్పుడే వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎంతసేపటికీ ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పరిస్థితి లేకపోవడంతో మాజీ హోం మంత్రి కారుదిగి ముందుకొచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంత రద్దీ ఉండే జడ్చర్లలో ఒక్క పోలీస్ లేకపోవడం ఆందోళనకరమన్నారు. ట్రాఫిక్ సమస్యలపై నిర్లక్ష్యం వీడాలని, ప్రజల కొరకు పనిచేయాలని సూచించారు.


