● డెంగీగా అనుమానాలు..
గ్రామంలో విషాదఛాయలు
లింగాల: పండుగ సంబ రం,పుట్టినరోజు సంతో షం 24గంటలు దాటక ముందే అకస్మాత్తుగా యు వతి మృతి ఘటన ఆదివారం మండలంలోని వడ్డెరాయవరంలో చోటుచేసుకుంది. వడ్డె రాయవరానికి చెందిన దండు ఈశ్వరయ్య, బాలమ్మ మూడో సంతానం దండు చంద్రకళ(18) శనివారం కుటుంబ సభ్యుల నడుమ పుట్టిరోజు జరుపుకొంది. అదేరాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రంగా ఉండడంతో ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ.. ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. యువతి డెంగీతో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. కాగా, మృతురాలు ప్రాథమిక స్థాయి వరకు చదువుకొని తల్లిదండ్రుల వెంట హైదరాబాద్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకునేదని గ్రామస్తులు తెలిపారు. దసరా పండుగ కోసం స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి రాగా.. అనుకోకుండా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కడుపునొప్పి భ రించలేక ఆత్మహత్య
మల్దకల్: కడుపునొప్పి భ రించలేక ఓ వ్యక్తి ఇంట్లో ఎ వరూ లేని సమయంలో ఉ రేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం మండలంలోని సద్దలోనిపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుర్వ గోవిందు (52) కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేవా డు. ఈ క్రమంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చే యించినా నయం కాకపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ స భ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భా ర్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బైక్ అదుపు తప్పడంతో..
ఉండవెల్లి: మండలంలోని కంచుపాడుకు చెందిన అ శోక్‌కుమార్ యాదవ్ (22) ఈ నెల 21న ఉండవెల్లి నుంచి కంచుపాడుకు బైక్ పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ శనివారం రాత్రి సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. అక్క సుజాత ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
మతిస్థిమితం సరిగాలేని యువకుడు బలవన్మరణం
కొత్తపల్లి: మతిస్థిమితం సరిగ్గా లేని ఓ యువకుడు విద్యుత్ స్తంభానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మద్దూరు మున్సిపాలిటీలో ఆదివారం వెలుగుచూసింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం గుర్మిటకల్ తాలూకా పుట్‌పాక్ గ్రామానికి చెందిన తన్నె భీమప్ప (34) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం మద్దూరు మండలం దంగాన్‌పూర్‌లోని తన అత్త దేవంద్రమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరాడు. అతడు దంగాన్‌పూర్ వెళ్లకుండా మద్దూరుకు చేరుకున్నాడు. రాత్రివేళ పట్టణంలోని దినేష్ రైస్‌మిల్ సమీపంలో విద్యుత్ స్తంభానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం వాహనదారులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అయితే యువకుడి ఆత్మహత్య విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రి మార్చురీకి చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్ల లు ఉన్నట్లు తెలిపారు. మృతుడి సోదరుడు భీమప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
మిడ్జిల్: మండలంలోని రాణిపేట్‌లో ఈనెల 21న మోటార్ సైకిల్‌ను కారు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న సాతర్ల శ్రీనివాసులు (35) తీవ్రంగా గాయ పడ్డాడు. దీంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం సా యంత్రం మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసు లు తెలిపారు. మృతుడి భార్య అలివేల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతుడికి భార్యతో పాటుగా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.


