మనస్తాపంతో బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

వనపర్తి రూరల్‌: పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి 11 గంటల సమయంలో పట్టణంలో చోటు చేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ హృషికేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని రాజనగరం గ్రామానికి చెందిన నక్క సిద్ధేశ్వర్‌ (20) బీటెక్‌ చదువుతున్నాడు. తండ్రి మద్యం తాగి రోజూ తల్లితో గొడవ పడుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మార స్థితిలో ఉన్న బాధితుడిని కుటుంబ సభ్యులు వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై మృతుడి తల్లి నక్క పద్మ ఫిర్యాదు మేరకు ఆదివారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

అవమానంతో యువకుడు ఆత్మహత్య

బల్మూర్‌: అత్తమామలతో జరిగిన గొడవలో అవమానంగా భావించిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘట న మండల కేంద్రం బల్మూర్‌లో చోటుచేసుకుంది. పోలీ సులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బల్మూర్‌కు చెందిన ఎడుపుల సైదులు(22)కు, దేవుని తిరుమలాపురం(పీకే పల్లి మండలం)కు చెందిన మహేశ్వరితో ఆరునెలల క్రితం వివాహం జరిగింది. ఈనెల 24న మహేశ్వరిని పుట్టింటికి తీసుకెళ్లడానికి ఆమె తల్లిదండ్రులు వల్లయ్య, పద్మ, సోదరుడు శివ బల్మూర్‌కు వచ్చారు. పొలంలో పత్తి ఏరే పని ఉందని సైదులు భార్యను పంపేందుకు నిరాకరించాడు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవ జరిగింది. గొడవలో అవమానానికి గురై భయాందోళనకు గురైన సైదులు పొలం వైపు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు పొలంలో అతడు మృతిచెంది ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బు చ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం ని ర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement